Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 47

Story of Sapta maruths & the city of Visala !

బాలకాండ
నలుబది ఏడవ సర్గము
( సప్తమరుతుల కథ - విశాల నగర కథ)

సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా |
సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాs బ్రవీత్ ||

స|| గర్భే కృతే తు సప్తధా దితిః పరమ దుఃఖితా (భవతి) | స అనునయాత్ దురాధర్షం సహస్రాక్షం వాక్యం అబ్రవీత్ |

తా|| గర్భము ఏడు ముక్కలుగా చేయబడడముతో దితి అత్యంత దుఃఖితురాలయ్యెను. అప్పుడు ఆమె అనునయవాక్యములతో దుర్జయుడైన ఆ ఇంద్రునితో ఇట్లు పలికెను.

మమాపరాధాత్గర్భోయం సప్తధా విఫలీకృతః |
నాపరాధో స్తి దేవేశ తవాత్ర బలసూదన ||

స|| అయం గర్భః మమ అపరాధాత్ విఫలీ కృతః | బలసూదనా దేవేశ అత్ర తవ న అపరాధో అస్తి |

తా|| ఈ గర్భము నా అపరాధమువలన విఫలమాయెను. ఓ బలసూదనా ! దేవేశా ! దీనిలో నీ అపరాధమేమియునూ లేదు.

ప్రియం కర్తు మిచ్ఛామి మమగర్భ విపర్యయే |
మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంత్విమే ||

స|| మమ గర్భ విపర్యయే ప్రియం కర్తు మిచ్ఛామి | ఇమే మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవంతి |

తా|| నా గర్భము విపర్యమైననూ ప్రియము చేయుటకు కోరుచున్నాను.ఈ ఏడుగురు మరుత్తులు ఏడు స్థానముల అధిపతిలగుదురు.

వాతస్కంధా ఇమే సప్త చరంతు దివి పుత్రక |
మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజః ||

స|| దివ్యరూపా మమాత్మజః ఇమే సప్త వాతస్కంధా చరంతు దివి పుత్రక మారుతా ఇతి విఖ్యాతా|

తా|| దివ్యస్వరూపులైన నా ఆత్మజులు సప్తవాయువుల అధిపతులై దివ్యలోకములో మరుత్తులు అను పేరుతో ఖ్యాతి పొందెదరు.

బ్రహ్మలోకం చరత్వేక ఇంద్ర లోకం తథాపరః |
దివి వాయురితి ఖ్యాతః తృతీయోs పి మహాయశాః ||

స|| ఏకః బ్రహ్మ లోకః చరతి తథా అపరః ఇంద్రలోకం | తృతీయః అపి మహాయశాః వాయురితి దివి ఖ్యాతః |

తా|| ఓకడు బ్రహ్మలోకములో సంచరించును.ఇంకొకడు ఇంద్రలోకములో , మూడవవాడు మహాయశస్వియై వాయువు పేరుతో ఖ్యాతి పొందును.

చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్ |
సంచరిష్యంతి భద్రం తే దేవభూతా మమాత్మజః |
త్వత్కృతే నైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః ||

స|| సురశ్రేష్ఠ చత్వారః తవ శాసనాత్ దిశో వై సంచరిష్యంతి | భద్రం తే | దేవభూతా మమాత్మజః త్వత్కృతేన ఏవ నామ్నా మారుతా ఇతి విశ్రుతాః|

తా|| ఓ ఇంద్రా ! మిగిలిన నలుగురూ నీ శాసనములో నాలుగు దిశలలో చరింతురు. నీకు శుభమగుగాక. ఓ దేవభూతా నా అత్మజులు నీవు చేసిన కార్యము చే "మారుతా " అని పేరుతో వాసికెక్కుదురు.

తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురందరః |
ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదన ||
సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః |
విచరిష్యంతి భద్రం తే దేవరూపాస్తవాత్మజః ||

స|| బలనిషూదన పురందరః సహస్రాక్షః తస్యాః తద్ వచనం శ్రుత్వా ప్రాంజలిః దితింవాక్యం ఉవాచ|ఏతత్త్ సర్వం యథోక్తం తే భవిష్యతి న సంశయః ! తవాత్మజః దేవరూపా విచరిష్యంతి | భద్రం తే|

తా|| బలనిషూదుడు పురందరుడు అయిన ఇంద్రుడు ఆ మాటలను విని , ప్రాంజలి ఘటించి దితితో ఇట్లు పలికెను. " ఇదంతయూ నీవు చెప్పిన విధముగనే అగును.నీ పుత్రులు దివ్యస్వరూపులై సంచరించెదరు. నీకు శుభమగుగాక'.

ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్త్రౌ తపోవనే|
జగ్మతుస్త్రిదివం రామ కృతార్థావితి నశ్శ్రుతమ్ ||

స|| హే రామ ! తౌ మాతాపుత్రౌ తపోవనే ఏవం నిశ్చయం కృత్వా కృతార్థాః త్రిదివం జగ్మతుః ఇతి నః శ్రుతం|

తా|| ఓ రామా ! ఆ మాతాపుత్రులు ఇద్దరూ ఆ తపోవనములో ఈ విధముగా నిశ్చయముచేసి, కృతార్థులై స్వర్గమునకు వెళ్ళిరి అని వింటిమి.

ఏష దేశః కాకుత్ స్థ మహేంద్రాధ్యుషితః పురా |
దితిమ్ యత్ర తపస్సిద్ధాం ఏవమ్ పరిచచార సః ||

స|| హే కాకుత్ స్థ ! ఏష దేశః యత్ర పురా తపస్సిద్ధాం దితిం సః మహేంద్రః అధ్యుషితః ఏవం పరిచచార |

తా|| ఓ కకుత్ స్థ ! ఈ దేశములోనే పూర్వము తపసిద్ధురాలైన దితికి మహేంద్రుడు పరిచర్యలు సలిపెను.

ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః|
అలంబుసాయామ్ ఉత్పన్నో విశాల ఇతిశ్రుతః ||
తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీ కృతా ||

స|| హే నరవ్యాఘ్ర ! ఇక్ష్వాకో పరమధార్మికః అస్తు. (సః) అలంబుసాయామ్ విశాల ఇతి పుత్రః ఉత్పన్నో ఇతి విశ్రుతః | తేన చాసీత్ విశాల ఇతి ఇహ స్థానే పురీ కృతా |

తా|| ఓ నరవ్యాఘ్ర ! ఇక్ష్వాకుడు అనబడు పరమ ధార్మికుడు ఉండెడివాడు. అతడు అలంబుస ద్వారా విశాల అని పుత్రునకు జన్మనిచ్చెనని వినికిడి. ఆయన పేరుతోనే విశాల అను నగరము ఇచట కట్టబడినది.

విశాలస్యు సుతో రామ హేమచంద్రో మహాబలః|
సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రాదనంతరః ||
సుచంద్ర తనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః |
ధూమ్రాశ్వ తనయశ్చాపి సృంజయ స్సమపద్యత ||

స|| హే రామ ! హేమచంద్రః మహాబలః విశాలస్య సుతః | హేమచంద్రాత్ అనంతరః సుచంద్ర ఇతి విఖ్యాతః |హే రామ ! సుచంద్రః తనయః ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః | ధుమ్రాశ్వస్య తనయః సృంజయః అపి సమపద్యత |

తా|| ఓ రామా ! హేమచంద్రుడనువాడు విశాలుని పుత్రుడు. హేమచంద్రుని తరువాత సుచంద్రుడనువాడు పేరుపొందెను. ఓ రామా ! సుచంద్రుని తనయుడు ధూమ్రాశ్వుడు అని వినికిడి. ధూమ్రాశ్వుని పుత్రుడు సృంజయుడు.

సృంజయస్య సుత శ్శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్ |
కుశాశ్వః సహదేవస్య పుత్త్రః పరమధార్మికః ||
కుశాశ్వస్య మహాతేజాః సోమదత్తః ప్రతాపవాన్|
సోమదత్తస్య పుత్త్రస్తు కాకుత్ స్థ ఇతి విశ్రుతః ||

స|| సృంజయస్య సుతః ప్రతాపవాన్ శ్రీమాన్ సహదేవః | సహదేవస్య పుత్రః పరమధార్మికః కుశాశ్వః |కూశాశ్వస్య ( పుత్రః) సోమదత్తః ప్రతాపవాన్ మహాతేజాః | సోమదత్తస్య పుత్రః తు కాకుత్ స్థః ఇతి విశ్రుతః |

తా|| సృంజయుని పుత్రుడు సహదేవుడు శ్రీమంతుడు ప్రతాపము గలవాడు . సహదేవుని పుత్రుడు పరమధార్మికుడైన కుశాశ్వుడు. కుశాశ్వుని పుత్రుడు సోమదత్తుడు ప్రతాపముగలవాడు మహాతేజస్సు గలవాడు. సోమదత్తుని పుత్రుడు కాకుత్ స్థుడని వినికిడి.

తస్య పుత్త్రో మహాతేజాః సంప్రత్యేష పురీమిమామ్ |
అవసత్యమర ప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః ||
ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః |
దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంత సుధార్మికః ||

స|| తస్య పుత్రః మహాతేజాః దుర్జయః సుమతిః నామ సంప్రతిః ఏష ఇమామ్ పురీమ్ అవసత్యమరప్రఖ్యః |ఇక్ష్వాకస్య ప్రసాదేన వైశాలికా నృపాః సర్వే దీర్ఘాయుషః మహాత్మానః వీర్యవంతః సుధార్మికః |

తా|| అతని పుత్రుడు మహాతేజోవంతుడు దుర్జయుడు సుమతి అను పేరు గలవాడు. ప్రస్తుతము ఈ నగరమును పరిపాలించుచున్నాడు. ఇక్ష్వాకుని అనుగ్రహముచే విశాల నగరమును పాలించిన రాజులందరూ దీర్ఘాయుస్సుకలవారు. ధార్మికులు వీరులు.

ఇహాద్య రజనీం రామ సుఖం వత్స్యమహే వయమ్ |
శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి ||

స|| హే రామ ఇహ అద్య రజనీం సుఖం వత్స్యమహే వయం |హే నరశ్రేష్ఠ ! శ్వః ప్రభాతే జనకం ద్రష్టుం అర్హసి |

తా || ఓ రామా ! ఇక్కడ ఈ రాత్రికి సుఖముగా విశ్రమింతము. ఓ నరశ్రేష్ఠా ! రేపు ఉదయము జనకుని దర్శనమునకు పోయెదము.

సుమతిస్తు మహాతేజా విశ్వామిత్రమ్ ఉపాగతమ్ |
శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్ఛన్మహాయశాః ||
పూజాం చ పరమం కృత్వా సోపాధ్యాయస్సబాంధవః |
ప్రాంజలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రం అథాబ్రవీత్ ||

స|| మహాతేజా సుమతిస్తు విశ్వామిత్రం ఉపాగతం శ్రుత్వా నరవరస్రేష్ఠః ప్రత్యుద్ గచ్ఛన్ మహాయశాః |సహ ఉపాధ్యాయ సహ బాంధవః పరమం పూజాం కృత్వా , ప్రాంజలిః కుశలం పృష్ఠ్వా విశ్వామితం అథ అబ్రవీత్ |

తా|| మహాతేజోవంతుడైన సుమతి విశ్వామిత్రుని రాకగురించి తెలిసికొని మహాయశస్సుగల ఆ నరశ్రేష్ఠుడు ఎదురుగా వచ్చెను. పురోహితులతో బంధువులతో కలిసి విశ్వామిత్రుని పూర్తిగా పూజించి , ప్రాంజలిఘటించి ఈ విధముగా పలికెను.

ధన్యోస్మి అనుగ్రహీతోస్మి యస్య మే విషయం మునిః |
సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మయా ||

స|| హే మునిః ధన్యోశ్మి యస్య మే విషయం అనుగ్రహీతోశ్మి| (తవ) దర్శనం సంప్రాప్తః చ ఏవ ధన్యతరః నాస్తి |

తా|| ఓ మునీశ్వరా ! ధన్యుడను.మీ రాకతో అనుగ్రహించబడినవాడను. ! మీ దర్శనము కూడా ప్రాప్తమైనది. ఇంతకన్న ధన్యతరమైనది ఇంకొకటిలేదు.

ఇత్యార్షే శ్రీమద్రామయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తచత్వారింశ స్సర్గః ||
సమాప్తం ||

|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో నలభైఏడవ సర్గ సమాప్తము.||
|| ఓమ్ తత్ సత్ ||

|| Om tat sat ||